కోర్టుకు జగన్: పోలీసులది హంగామా అన్న విజయమ్మ

YS Vijayamma - Bharathi
హైదరాబాద్: ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు చంచల్‌గూడ జైలు అధికారులు శుక్రవారం ఉదయం తరలించారు. జగన్‌ తరలింపు నేపథ్యంలో చంచల్‌గూడ జైలు నుండి నాంపల్లి కోర్టు వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్‌ను ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలించారు.

జగన్‌ను చూసేందుకు జైలు వద్ద భారీగా కార్యకర్తలు, అభిమానులు గుమికూడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత విజయా రెడ్డి భారీగా కార్యకర్తలతో వచ్చారు. జగన్‌కు అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టుకు జగన్ తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, భార్య భారతి వచ్చారు. కోర్టు అనుమతితో జగన్‌తో వారు కాసేపు మాట్లాడే అకాశముంది.

కోర్టు వద్దకు రాకుండా చేస్తున్నారు: భారతి

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైయస్ భారతి రెడ్డి ఆరోపించారు. తమకు కోర్టు వద్దకు వచ్చేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు వద్దకు అభిమానులు, కార్యకర్తలు రాకుండే చేయడంపై విజయమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఎందుకంత హంగామా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాగా కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కోర్టుకు సబిత...

ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తన ఇంటి వద్ద నుండి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. ఆమె నిందితురాలిగా మొదటిసారి కోర్టు మెట్లు ఎక్కనున్నారు. సబితా ఇంటి నుండి బయలుదేరే సమయంలో భారీగా కార్యకర్తలు, అభిమానులు ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు.. సబితమ్మ నిర్దోషి అంటూ పెద్దగా నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+