పేరులోనే భారతి: జగన్ భార్యపై వర్ల, స్పీకర్‌పై అసంతృప్తి

Varla Ramaiah
హైదరాబాద్: ఫిరాయించే ఎమ్మెల్యేలు పదేళ్ల పాటు ఎన్నికలలో పాల్గొనకుండా చట్టం తేవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం డిమాండ్ చేశారు. శాసన సభలో స్పీకర్ ఎదురుగా విప్‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవడానికి ఇంత వ్యవధి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. ఫిరాయింపుదారులను చూసి ప్రజలు అసహ్యించుకొంటున్నారని, రామకోటయ్య, వేణుగోపాలాచారి అధికార పార్టీలో చేరారని వదిలేస్తారా? స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించాలని కోరారు.

పదిహేను మందిపై వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం వెలువడిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. "స్పీకర్ నిర్ణయం హర్షణీయం. కానీ, వారిపై వేటుకు ఇంత సమయం తీసుకోవడం సరి కాదు. పైగా అధికార పార్టీ పంచన చేరిన వారిని ఉపేక్షించడం ఎంత మాత్రం ప్రజాస్వామికం కాదు. వేణుగోపాలా చారి, చిన్నం రామకోటయ్య కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వారిపై చర్యలు తీసుకోలేదు.

హరీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్ బహిరంగంగానే తెరాసలో చేరారు. అయినా వారిపై చర్య తీసుకోలేదు. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఉండాలంటే అందరిపైనా చర్య తీసుకోవాలి. స్పీకర్ రాగద్వేషాలతో వ్యవహరించరాదు. ఈ తీరును ఖండిస్తున్నాం. దీనిపై స్పీకర్‌ను కలుస్తాం'' అని ఆయన చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్సీలపైనా వేటు వేయాలని కోరుతూ కౌన్సెల్ చైర్మన్‌ను కలుస్తామని తెలిపారు.

పేరు భారతి.. కానీ భారతీయం లేదు: వర్ల

జగన్ సతీమణి భారతి పేరులోనే భారతి ఉంది తప్ప.. ఆమెలో భారతీయం లేదని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. భారతి నాంపల్లి కోర్టు వద్ద శుక్రవారం మాట్లాడిన మాటలు సరైనవి కావన్నారు. ఇదే న్యాయం, ఇదే దేశం, ఇదేం రాష్ట్రమంటూ ఆమె మాట్లాడటం సరికాదన్నారు. జగన్ అవినీతికి పాల్పడకపోతే ఇంతకాలం జైలులో ఉండేవారా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+