'థర్డ్' అశలకు జయలలిత ఎసరు: మోడీపై ప్రశంసల జల్లు

మోడీ తనకు మంచి మిత్రుడని ఆమె చెప్పారు. మోడీకి ప్రమోషన్‌పై బిజెపి అంతర్గత వ్యవహారమంటూ వ్యాఖ్యానించడానికి ఆమె ఆదివారం నిరాకరించారు. వ్యక్తిగత స్థాయిలో మోడీ తనకు మంచి మిత్రుడని, సమర్థుడైన పరిపాలనా దక్షుడిగా మోడీపై తనకు గౌరవం ఉందని, తన శుభాకాంక్షలు మోడీకి ఎప్పుడూ ఉంటాయని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరైన నేతల్లో నరేంద్ర మోడీ ఉన్నారు. తమిళనాడు శానససభ ఎన్నికల్లో డిఎంకెను ఓడించి, అన్నాడియంకె అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడో సారి మోడీ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
గత కొద్ది కాలంగా జయలలితతో బిజెపి స్నేహం చేయడానికి ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో బిజెపి కొత్త మిత్రుల కోసం అన్వేషిస్తోంది. మోడీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మోడీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడానికి భాగస్వామ్య పార్టీ జెడియు మొరాయిస్తోంది. జెడియుతో తెగదెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధపడి బిజెపి గోవా సమావేశంలో మోడీని ముందుకు తెచ్చింది. ఈ స్థితిలో మోడీ జయలలితను బిజెపి వైపు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications