వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బయ్యారంపై టిడిపి, తెలంగాణపై టిఆర్ఎస్: సభ వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: మంగళవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. ఆయా పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వాయిదా తీర్మానాలను తిరస్కరించడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. వాయిదా తీర్మానాలు చేపట్టాలని బట్టుబట్టాయి. సభను ఉపయోగించుకోవాలని, అన్ని సమస్యల చర్చకు అవకాశం ఉంటుందని, ఓపిక పట్టాలని స్పీకర్ విపక్షాలకు సూచించారు.

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన తెలుగుదేశం, తెలంగాణపై భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌లపై వైయస్సార్ కాంగ్రెసు, అంగన్ వాడి సమస్యలపై సిపిఎం, విద్యుత్ ఛార్జీల పెంపు, సర్‌ఛార్జిలపై మజ్లిస్ పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి.

వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో టిడిపి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టాయి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చించాలని టిడిపి, తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

అంతకుముందు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల పొట్టకొట్టేలా నాడు వైయస్ రాజశేఖర రెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. టిడిపి పోరాటం వల్లే రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనులు కేటాయింపు రద్దయిందని టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.

English summary
House adjourned for half an hour amid protest on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X