తెలంగాణపై తేల్చేశారు!: కష్టమని షిండే, నష్టమని ఎంపీ

తమ పార్టీ నుండి ఇద్దరు పార్లమెంటు సభ్యులు, ఒక నాయకుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లారని చెప్పారు. ఇక ముందు ఎవరు ఇతర పార్టీలలోకి వెళ్లరని చెప్పారు. ఆ ముగ్గురి తర్వాత వేరెవరు తెరాసలోకి వెళ్లిపోలేదని సుశీల్ కుమార్ షిండే చెప్పారు.
హామీ నిలబెట్టుకోవాలి: గుత్తా
తెలంగాణపై కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. హామీని నిలబెట్టుకుంటే ధర్నాలు, ఆందోళనలు ఉండేవి కాదు కదా అన్నారు. ప్రజల ఆకాంక్షను ఏ శక్తి అడ్డుకోలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణపై నిర్ణయం ఉంటుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆకాంక్షించారు. లేదంటే తెలంగాణలో కాంగ్రెసు నష్టపోవడం ఖాయమన్నారు.
కెసిఆర్‌పై చర్యలు తీసుకోండి: రఘునందన రావు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన చర్యలు తీసుకోవాలని రఘునందన రావు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కరీంనగర్ సభ సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన నాగరాజు విషయంలో ఆయన హెచ్చార్సీని ఆశ్రయించారు.
ఛలో అసెంబ్లీపై హెచ్చార్సీకి తెలంగాణ అడ్వోకేట్ జెఏసి
తెలంగాణవాదుల ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని తెలంగాణ లాయర్ల ఐక్యకార్యాచరణ సమితి హెచ్చార్సీని ఆశ్రయించింది. బుధవారం లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ డిజిపిని ఆదేశించింది.
చిత్రహింసలు: కవిత
బైండోవర్లతో ప్రభుత్వం తెలంగాణవాదులను చిత్ర హింసలకు గురి చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తెలంగణవాదులు విజయవంతం చేయాలన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే అసెంబ్లీ ముట్టడి రద్దు చేసుకుంటామని చెప్పారు.
కెసిఆర్‌పై కేసు - తెరాస ఆందోళన
రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ ఎదుట చింతా స్వామి చావు డప్పు మోగించిన విషయం తెలిసిందే. తెరాస భవన్ ఎదుట తనను కులం పేరుతో దూషించారని అతను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కెసిఆర్ తదితరులపై కేసును నమోదు చేశారు. కెసిఆర్ పైన కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెరాస కార్యకర్తలు ఎసిపి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications