వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనిప్పుడు స్వేచ్ఛా జీవిని: డిఎల్ రవీంద్రా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: తాను ఇప్పుడు స్వేచ్ఛా జీవిని అని, చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి, మైదుకూరు కాంగ్రెసు ఎమ్మల్యే డిఎల్ రవీంద్రా రెడ్డి సోమవారం అన్నారు. ఆయన అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావులు మాట్లాడుకుంటుండగా అక్కడకు వచ్చిన డిఎల్ సరదాగా పై వ్యాఖ్య చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనను తన మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆకుల లలిత

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆకుల లలితను నియమిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్‌భండార్ గ్రామానికి చెందిన హన్మాండ్లు పటేల్, సుగుణ దంపతుల కుమార్తె లలిత. భర్త ఆకుల రాఘవేందర్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే.

2001లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి, మాణిక్ భండార్ నుంచి ఎంపిటిసి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2003 సెప్టెంబర్ 26న ఎంపిపి పదవి చేపట్టారు. 2004 నుంచి తొమ్మిదేళ్ల పాటు నిజామాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. 2006 సెప్టెంబర్ 2న మాక్లూర్ జడ్పిటిసి సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

2008లో డిచ్‌పల్లి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 ఫిబ్రవరి 1న నిజామాబాద్‌లో లలిత ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనితా వర్మ హాజరయ్యారు.

ఆ సభకు తరలివచ్చిన మహిళలను, సభ నిర్వహణను చూసి లలితను అభినందించారు. 2013 మే 25న నిజామాబాద్ డిసిసి అధ్యక్షురాలిగా నియమితురాలై.. ఈనెల 7న ప్రమాణస్వీకారం చేశారు. మూడు రోజులకే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పదవి ఆమెను వరించింది.

English summary
Former Minister DL Ravindra Reddy said on Monday that he is free bird now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X