వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎలా రాదో చూస్తాం?: సుదర్శన్, మళ్లీ ఢిల్లీకి..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sudarshan Reddy
హైదరాబాద్: తెలంగాణ ఎలా రాదో చూస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్సన్ రెడ్డి మంగళవారం అన్నారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రెండో రోజు ఈ రోజు సభ ప్రారంభమైన అనంతరం అరగంట వాయిదా పడింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉందని, కేంద్రం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం తమకుందన్నారు.

తెలంగాణ ఎందుకు రాదో చూస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తాము మరోసారి ఢిల్లీకి వెళ్తామన్నారు. మంత్రులతమంతా ఢిల్లీకి వెళ్లి తెలంగాణపై తేల్చుకుంటామన్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి సదస్సులు నిర్వహిస్తామన్నారు. తెలంగాణ కోసం అవసరమైతే తాము ఎన్నికలకు దూరంగా ఉండేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని సుదర్శన్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ కోసం పార్టీ అధిష్టానాన్ని మరోసారి కలుస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి చెప్పారు. అందరం ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై మరోసారి వివరిస్తామన్నారు. తెలంగాణ విషయంలో స్థానిక ఎన్నికలలో ఏం చెప్పాలనేది నిర్ణయిస్తామని అన్నారు.

కాగా, తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిందేనని టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పార్టీలలో ఏకాభిప్రాయం లేదని కేంద్రమంత్రి చిదంబరం అన్నారని చెప్పారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏమీ మాట్లాడటం లేదన్నారు. తీర్మానం పెడితే ఆ మూడు పార్టీల రంగు తెలిసిపోతుందన్నారు. మరోవైపు తెలంగాణపై పంచాయతీ ఎన్నికలలో ఏం చెప్పాలనేది నిర్ణయించుకుంటామన్నారు.

పలువురు తెలంగాణ మంత్రులు, బిజెపి, తెరాస, సిపిఐ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి ఛలో అసెంబ్లీకి అనుమతివ్వాలని కోరారు.

English summary
Minister Sudarshan Reddy said that Telangana Ministers will fight for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X