రంగంలోకి దిగిన నరేంద్ర మోడీ: కొత్త నినాదం

పార్టీ పదవులకు అద్వానీ రాజీనామా చేయడంపై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. అద్వానీ అలకను తీర్చడానికి మోడీ విషయంలో దిగి రావడానికి బిజెపి గానీ ఆర్ఎస్ఎస్ గానీ సిద్ధంగా లేవు. నరేంద్ర మోడీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
మార్గదర్శకత్వం అవసరమంటూ రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని కోరడానికి మురళీ మనోహర్ జోషీ, జస్వంత్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, గోపీనాథ్ ముండై, రవి శంకర్ ప్రసాద్, కల్‌రాజ్ మిశ్రా వంటి నేతలు అద్వానీ ఇంటికి బారులు తీరారు.
అద్వానీని ఒప్పించడానికి పరిష్కారం కనుక్కుంటారనే సూచనలను నాయకులు అందిస్తున్నారు. అద్వానీ తమ గైడ్ అని, తమ గైడ్‌గా ఉంటారని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో బార్మార్‌లో రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. మోడీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications