కొడుకుకు హింస: తెలుగు జంటకి క్షమాభిక్షకు నార్వే నో

కాగా, కుమారుడిని హింసించారనే ఆరోపణలపై తెలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో కోర్టు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు చంద్రశేఖర్, అనుపమ దంపతులకు జైలు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష ఖరారు చేసింది.
పిల్లలను దండించారనే ఆరోపణలతో జైలు పాలైన నార్వేలోని కోర్టు ఈ శిక్ష విధించింది. దీనిపై తల్లిదండ్రులు హైకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ వారికి చుక్కెదురయింది. నార్వే దంపతులకు క్షమాభిక్ష పెట్టాలని ఇటీవల కేంద్రం లేఖ రాసింది. దీంతో తమ చట్టాల ప్రకారం కుదరదని నార్వే ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఆ దంపతులు తమ కుమారుడి ఒంటిని కాల్చారని అప్పుడు పోలీసులు ఆరోపించారు. వారు తమ ఏడేళ్ల కుమారుడికి వారు వాతలు పెట్టినట్లు పోలీసులు ఆరోపించారు. పిల్లవాడి ఒంటిపై కాల్చిన మరకలు, మచ్చలు ఉన్నాయని, బెల్టుతో కొట్టారని ఓస్లో పోలీసు శాఖ ప్రాసిక్యూషన్ అధిపతి కుర్ట్ లిర్ ఆరోపించారు.
అయితే, ఆ ఆరోపణలను తెలుగు దంపతులు చంద్రశేఖర్ వల్లభనేని, అనుపమలు కూడా అప్పడే ఖండించారు. పిల్లలను బాధించలేదని, పిల్లవాడి పట్ల సరిగా వ్యవహరించి ఉండకపోవచ్చు గానీ బాధించలేదని, సహాయం కోసం వారు చూశారని, కానీ అది లభించలేదని అనుపమ తరఫు న్యాయవాది కోర్టు తీర్పునకు ముందు అన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications