బాబు శిఖండిపాత్ర: కెటిఆర్, ఆనం కుక్కతోకపై టిడిపి ఫైర్

గిరిజనులపై టిడిపికి అంత ప్రేమ ఉంటే పోలవరం విషయంలో ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే చంద్రబాబు సాధ్యం కాదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. బాబు కనుసన్నుల్లోనే తెలంగాణ టిడిపి నేతలు పని చేస్తున్నారని మండిపడ్డారు.
సభలో గందరగోళం
అసెంబ్లీలో కుక్క తోక వంకరలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాసనసభలో మాట్లాడటంపై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన త మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని దూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. ఆనం వ్యాఖ్యలపై టిడిపి నేతలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశారు.
ఉద్యమాన్ని అణిచివేస్తున్నారు: కడియం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందస్తు అరెస్టులకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. హన్మకొండలోని జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిఎం నల్ల చట్టాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలమని చెప్తున్న కాంగ్రెసు, టిడిపిలు అసెంబ్లీలో తీర్మానానికి ఎందుకు పట్టుబడటం లేదన్నారు.












Click it and Unblock the Notifications