వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ ఎన్నికల్లో పోటీ చేయరు, అమెరికాలో సెటిల్: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయరని, ఆయన అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నారని మాజీ మంత్రి, మైదుకూరు శాసన సభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని కిరణ్ సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు గెలిచే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ విషయం సిఎంకు కూడా తెలుసునని చెప్పారు.

అందుకే ఆయన వచ్చే ఎన్నికలలో పోటీ చేయకూడదని భావిస్తున్నారన్నారు. ఆయన సిఎం పదవి నుండి దిగిపోగానే అమెరికాలో వెళ్లాలనే యోచనలో ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు తరఫున పోటీ చేసేందుకు కడప జిల్లాలో అభ్యర్థి దొరికే పరిస్థితి లేదన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో మజ్లిస్ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కిరణ్ సోదరులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారని, అదే నిజమనిపిస్తోందన్నారు.

గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ చేసిన ఓబుళాపురం గనుల పక్కనే ఉన్న రూ.వెయ్యి కోట్ల విలువైన ఖనిజ సంపదను మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి చెందిన ఎస్సార్ మినరల్స్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై తాను మంత్రి గల్లా అరుణ కుమారిని అప్రమత్తం చేశానని చెప్పారు.

అసెంబ్లీ అరగంట వాయిదా

మరోవైపు బుధవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కాసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

English summary
Former Minister DL Ravindra Reddy alleged that Kiran Kumar Reddy is planning to settle in America after general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X