వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రామాలొద్దు: కిరణ్ ఆగ్రహం, అవమానించారని తెరాస

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
హైదరాబాద్: శానససభ ఆవరణలోని తన ఛేంబర్ బయట నిరసనకు దిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెరాస శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఛేంబర్ వద్ద బుధవారం ఉదయం బైఠాయించారు. దాంతో ముఖ్యమంత్రి వారిపై మండిపడ్డారు.బయట నాటకాలు వద్దు, లోనికి రండి మాట్లాడుకుందామని ఆయన అన్నారు.

తమను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవమానిస్తున్నారని తెరాస శానససభ్యులు మండిపడ్డారు. చలో అసెంబ్లీకి అనుమతి కోరినా ముఖ్యమంత్రి స్పందించడం లేదని వారు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. తాము డ్రామాలు ఆడుతున్నామంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం హేయమని వారన్నారు.

అహంకారంతో, అహంభావంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఉప నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ముఖ్యమంత్రిని తాము చూడలేదని వారన్నారు. ప్రతిపక్షాలకు దర్నా చేసే హక్కు ఉందని వారన్నారు.

తెలంగాణ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస శాసనసభ్యులు అంతకు ముందు శాసనసభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించినా వారు వినలేదు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. రెండు సార్లు శానససభ వాయిదా పడింది.

నీలం తుఫాన వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, గత నాలుగేళ్లుగా వడగళ్ల వానలతో నష్టపోయిన రైతలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఛేంబర్ వద్ద బైఠాయించిన తెరాస శాసనసభ్యులు డిమాండ్ చేశారు. తన ఛేంబర్ వద్ద బైఠాయించిన శాసనసభ్యులను దాటుకుంటూ ఆయన ఛేంబర్‌లోకి వెళ్లిపోయారు.

English summary
CM Kiran kumar Reddy has expressed anguish at Telangana Rastra Samithi (TRS) MLAs, who were sat before his chamber on farmers plight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X