విహారంలో విషాదం: బోటు మునిగి టెక్కీ జంట మృతి

ఈ నెల 20న ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లేందుకు వీసి కోసం భార్యాభర్తలు హైదరాబాదుకు వెళ్లారు. అక్కడి నుంచి విహార యాత్ర కోసమని కేరళ వెళ్లారు. కేరళలో బోట్ షికారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ బోటు తలకిందులు కావడంతో నదిలో పడి మృతి చెందారు. భార్య నాగమణి మృతదేహం మంగళవారమే దొరికింది. సాగర్ మృతదేహం కోసం గాలించి బుధవారం కనుగొన్నారు. బంధువులు కేరళకు బయలుదేరారు.
ఆర్కే బీచ్‌లో నలుగురి గల్లంతు
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలోకి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరి ఆచూకి కోసం సహాయక బృందాలు ప్రయత్నించాయి. గల్లంతైన వారిలో ఒకరు మృతి చెందారు. ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించింది. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాజువాకకు చెందిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
నకిలీ బంగారం కలకలం
కడప కేంద్ర కారాగారంలో నకిలీ బంగారం విక్రయం కలకలం సృష్టించింది. తోటి ఖైదీకి నకిలీ బంగారం విక్రయించడానికి వచ్చిన ఖైదీల బంధువులను జైలు అధికారులు పట్టుకున్నారు. ములాకత్‌లో నకిలీ బంగారం తీసుకు రావాలని ఖైదీ తన భార్యను పురమాయించాడని పోలీసుల విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications