జగన్‌పై వ్యతిరేకత ఎందుకో చెప్తా: ఉండవల్లి, బాబు పైనా

ఇందులో భాగంగానే 2012-13 వార్షిక నివేదికను 29న రాజమండ్రిలో సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది జనవరి 25న రాజమండ్రి మహాసభలో తాను చేసిన ఉపన్యాసంపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చేసిన దూషణలకూ అదే రోజు సమాధానం చెబుతానన్నారు.
భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నిజ స్వరూపం, గోధ్రా సంఘటన, తదుపరి మారణహోమం గురించి కూడా ప్రస్తావిస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మనసులోని మాటను వివరిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని భావిస్తున్నారు.
కొద్దిరోజులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications