వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూర్ఖుడిలా చంద్రబాబు: సాక్షి బ్యాన్‌పై జూపూడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
హైదరాబాద్: సాక్షి మీడియాను తెలుగుదేశం పార్టీ బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు విరుచుకుపడ్డారు. వార్తల నుంచి విషయాలు తెలుసుకోవాలే గానీ మూర్ఖుల్లా మారకూడదని ఆయన సలహా ఇచ్చారు. సాక్షి, టీన్యూస్ మీడియాలను బహిష్కరించడం పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా విఫలం కావడం వల్లనే చంద్రబాబు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నచ్చకపోతే చదవడం మానేయాలని, కానీ ఇలా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. ఇష్టం లేని మీడియాను మూయడం చంద్రబాబు తాతల వల్ల కూడా కాదని ఆయన అన్నారు.

సాక్షికి వాణిజ్య ప్రకటనలు ఇవ్వకుండా అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు వెనుకాడలేదని ఆయన అన్నారు. ఈరోజు సాక్షిని అన్నవాళ్లు రేపు మరొకరిని అనబోరనే గ్యారంటీ ఏమీ లేదని ఆయన అన్నారు.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం

శానససభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని తెలుగుదేశం పార్టీ అనడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం విసరడమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి అన్నారు. నామ్ కే వాస్తేగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తెస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

సభను సజావు జరపడంలో అధికార, ప్రతిపక్షాలకు సమాన బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. సభను అడ్డుకున్న సభ్యులను సస్పెండ్ చేసేలా తీర్మానం చేయాలని ఆయన సూచించారు. ఫెడరల్ లేదా మూడో ఫ్రంట్ భాగస్వాములవుతామని అంటూ చంద్రబాబు పిలవని పేరంటానికి ఆరాటపడుతున్నారని మైసురారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకటి రెండు సీట్లు కూడా రాని చంద్రబాబును ఎవరు చేర్చుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
YSR Congress party leader Jupudi Prabhakar Rao opposed the Telugudesam party president Nara Chandrababu Naidu's comments on YS Jagan's Sakshi media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X