రైలుపై దాడి: ఆయుధాలు ఎత్తుకెళ్లిన నక్సల్స్

నక్సలైట్ల దాడిలో ముగ్గురు మరణించినట్లు, ఏడుగురు గాయపడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గాయపడినవారిలో రైలు డ్రైవర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి అందే మార్గాలు నక్సలైట్లకు మూసుకుపోయాయని, అందుకే ఈ చర్యకు దిగారని, ప్రజలపై, రాజకీయ నాయకులపై దాడులు చేయడాన్ని బట్టి నక్సలైట్లు వెనకడుగు వేస్తున్నారని చెప్పడానికి సంకేతమని హోం శాఖ సహాయ మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ అన్నారు.
జామాయి రైల్వే స్టేషన్‌కు ముందు కుంద్రా హాల్ట్‌లో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు నక్సలైట్లు రైలుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఓ ప్రయాణికుడితో పాటు ఆర్‌ఫిఎఫ్ జనాను ఉన్నాడు. రైలు డ్రైవర్‌కు బుల్లెట్ గాయాలు తగిలాయి.
జమాయి అటవీ ప్రాంతంలోకి రాగానే నక్సలైట్లు రైలును చుట్టుముట్టి కాల్పులు జరిపారని పిటిఐ వార్తా సంస్థ తెలియజేస్తోంది. అర గంట పాటు ఎదురు కాల్పులు జరిగాయి. డ్రైవర్‌ను నిర్బంధించి నక్సలైట్లు రైలును హైజాక్ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
నక్సలైట్లకు చెందిన ఓ వ్యక్తి రైలులో అప్పటికే ఉన్నాడని, వారు నిర్దేశించుకున్న ప్రదేశానికి చేరుకోగానే అతను చైన్ లాగాడని అంటున్నారు. రైలు రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. నక్సలైట్ల దాడికి తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు కిటికీల అద్దాలు, కాంపార్టుమెంట్ల తలుపులు మూసేసుకున్నారు.












Click it and Unblock the Notifications