యాడ్ తంటా: టెండూల్కర్, ధోనీలపై కేసు నమోదు
న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే అడ్వర్టయిజ్‌మెంట్ అంటూ ఉత్తరాఖండ్ ఆహార భద్రతా శాఖ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై కేసు నమోదు చేసింది. మొత్తం ఎనిమిది మంది భారత క్రికెటర్లపై ఆ శాఖ కేసు పెట్టింది. వారితో పాటు సహారా - క్యూ యజమాని సుబ్రతా రాయ్‌పై కూడా కేసు నమోదు చేసింది.
సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్‌లపై ఉత్తరాఖండ్ ఆహార భద్రతా శాఖ కేసు నమోదు చేసింది. వారితో పాటు ఇద్దరు బాలీవుడ్ నటులు రితిక్ రోషన్, ప్రియాంక చోప్రాలపై కూడా కేసు నమోదైంది.

బహాద్రాబాద్‌లోని సహారా క్యూ దుకాణంలోని నూనె, జామ్, తదితర సరుకులను ఆహార భద్రతా శాఖ పరీక్షించిన ఆహార భద్రతా శాఖ అధికారులు కల్తీ సరుకులను ప్రమోట్ చేస్తున్నారంటూ వారిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications