వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ విషయం పట్టదు: రాహుల్, ప్రధాని పదవిపై నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi - Rahul Gandhi
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విషయం తనకు పట్టదని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పారు. బిజెపిలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాహుల్ గాంధీ తొలిసారి పెదవి విప్పారు.

కమలంలో మోడీ వికాసం తనకు పట్టని విషయమని తేల్చేశారు. జెడి(యు)విషయంలో తాను ప్రత్యేకంగా చేయగలిగిందేమీ లేదని అన్నారు. బిజెపి ఎన్నికల ప్రచార సారథి బాధ్యతలను ఇటీవల మోడీ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ స్పందిస్తూ... ఇది వారి అంతర్గత విషయమని, నిజంగానే అది తనకు పట్టడం లేదన్నారు.

తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతమేర సంక్షేమం అందుతోంది, దానికోసం ఇంకెన్ని విభిన్న పద్ధతులను అనుసరించాలనే అంశమే ఇప్పుడు తనను ఎక్కువగా కలవరపెడుతోందని చెప్పారు. జెడి(యు)లో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. ఆ పార్టీని కూటమిలో కలుపుకోవాలా? లేదా? అనేది పార్టీ సీనియర్లు నిర్ణయిస్తారని, ఆహ్వానాలు పంపడం తన స్థాయి వ్యవహారం కాదన్నారు.

తమకు సన్నిహితంగా ఉండే లౌకికవాద పార్టీగా జెడి(యు)ని కాంగ్రెస్ ప్రతినిధి భక్త చరణ్ దాస్ పేర్కొన్న దరిమిలా రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధాని అభ్యర్థిగా తన ఎంపికపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీని అడగాలని ఆయన అన్నారు.

English summary
Congress vice president Rahul Gandhi on Saturday sidestepped the fast paced political developments in NDA after Gujarat CM Narendra Modi's ascendance as BJP's chief campaigner for 2014, saying he is not concerned about the elevation of the Gujarat chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X