వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో తెగిన బంధం: బిజెపి కౌంటర్, ప్రభుత్వం సేఫ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

LK Advani - Nitish Kumar - Narendra Modi
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉన్న సమయంలో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్డీయే కూటమిలోని సంక్షోభం కారణంగానే రాజకీయాలు వేడెక్కాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రచార సారథిగా నియమించడంపై అలక వహించిన జెడి(యు), బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని అసంతృప్తిని చూపించి వైదొలిగేందుకు సిద్ధపడింది. అద్వానీ ఆ అంశం సమసిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపి ఇబ్బందులకు గురి చేస్తోందంటూ కూటమికి రాంరాం చెప్పింది.

అద్వానీ ఆగ్రహం

కూటమి నుండి జెడి(యు) వైదొలిగిన నేపథ్యంలో ఎల్‌కె అద్వానీ బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. గోవాలో పార్టీ తీసుకున్న నిర్ణయాలనే ఎన్డీయే కూటమిలో సంక్షోభాన్ని తెచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీకి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించడం వల్లనే జెడి(యు) కూటమి నుండి వైదొలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మోడీ ప్రచార సారథ్య బాధ్యతలపై పునరాలోచించుకోవాలని రాజ్‌నాథ్‌కు సూచించినట్లుగా తెలుస్తోంది.

17 ఏళ్ల బంధాన్ని తెంచుకొని...

మోడీ కారణంగా జెడి(యు) బిజెపితో పదిహేడేళ్ల అనుబంధాన్ని తెంచుకుంది. ఎన్డీయేలో ప్రధాన కూటమి అయిన జెడి(యు) వైదొలగడం ఇటు కాంగ్రెసుకు, అటు థర్డ్ లేదా ఫెడరల్ ఫ్రంట్ పార్టీలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. జెడి(యు)ను తమ వైపుకు రప్పించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మోడీ కారణంగానే తాము వైదొలిగామని జెడి(యు) అగ్రనేతలు ఆదివారం మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు.

విశ్వాస పరీక్షతో బల నిరూపణకు సిద్ధమవుతున్న నితీష్ కుమార్‌కు మద్దతిచ్చేందుకు కాంగ్రెసు అనుకూలంగా ఉంది. మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం సాగుతున్నప్పటి నుండే నితీష్ అసంతృప్తితో ఉన్నారు. జెడి(యు)ను ప్రసన్నం చేసుకునేందుకు బిహార్‌కు యూపిఏ ప్యాకేజీలు ప్రకటించేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్... జెడి(యు) కోసం ఎదురు చూస్తోంది. జెడి(యు) మాత్రం స్వతంత్ర ఎమ్మెల్యేలతో గట్టెక్కి థర్డ్ లేదా ఫెడరల్ ఫ్రంట్ వైపు చూస్తోంది. మరోవైపు మోడీ పైన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు.

ఎవరికెన్ని సీట్లు, నితీష్ విశ్వాసం నెగ్గుతుందా?

బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే చాలు. గత ఎన్నికలలో జెడి(యు) 118, బిజెపి 91, కాంగ్రెసు 4, ఆర్జెడి 22, ఎల్జెపి 1, సిపిఐ 1, ఇతరులు ఆరు స్థానాలలో గెలిచారు. జెడి(యు)కు 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంటే చాలు. స్వతంత్రులు లేదా కాంగ్రెసు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ ధైర్యంతోనే నితీష్ బల నిరూపణకు సిద్ధమయ్యారు.

మైనార్టీ ఓట్ల కోసమే!

నితీష్ కుమార్ మైనార్టీ ఓట్ల కోసమే మొదటి నుండి నరేంద్ మోడీని వ్యతిరేకిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోడీ పైన ఉన్న గోద్రా మచ్చ నేపథ్యంలో ఆయనను బలంగా వ్యతిరేకించడం ద్వారా బిహార్‌లో ఉన్న మైనార్టీ ఓట్లను తమ వైపుకు ఆకర్షించవచ్చునని ఆయన ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఆయన మొదటి నుండి మోడీని వ్యతిరేకించడానికి కారణం అదే అంటున్నారు. భవిష్యత్తులో వచ్చి పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో మైనార్టీల ఓట్లను కొల్లగొట్టి ఆర్జెడిని మరోసారి మట్టికరిపించాలని జెడియు చూస్తోంది. అందుకు మోడీని పావుగా వాడుకున్నదని చెబుతున్నారు.
జెడి(యు)కు బిహార్ బిజెపి కౌంటర్

బిహార్ రాజకీయ చరిత్రలో ఇది బ్లాక్ డే అని బిజెపి బిహార్ రాజకీయ నేత, ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అన్నారు. బిజెపిలో ఎలాంటి చీలిక రాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి, ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా జెడి(యు) వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. నితీష్ జెడి(యు) ముఖ్యమంత్రి కాదని, ఎన్డీయే ముఖ్యమంత్రి అని తెలుసుకోవాలన్నారు.

ఎవరేమన్నారు?

గోవాలోని నిర్ణయాల వల్లే ఎన్డీయోలో సంక్షోభం - రాజ్‌నాథ్‌తో ఫోన్‌లో అద్వానీ

పొత్తు విచ్ఛిన్నం దురదృష్టకరం, విచారకరం - సుష్మా స్వరాజ్

మోడీ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు - ముక్తార్ అబ్బాస్ నక్వీ

చివరి వరకు ప్రయత్నాలు చేశాం, బిజెపి చర్చించేందుకు ముందుకు రాలేదు - జెడి(యు)

మోడీ ప్రతిష్ట నీటి బుడగలాంటిది - రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్

పొత్తు విచ్ఛిన్నం ఇరు పార్టీలకు నష్టమే - శివసేన

English summary
The JDU on Sunday formally announced the split of its 17 year old ties with the BJP in Bihar and walked out of the NDA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X