17 ఏళ్ల బిజెపి బంధానికి రాంరాం, 19న విశ్వాసం: నితీష్

Nitish Kumar - Sharad Yadav
పాట్నా: భారతీయ జనతా పార్టీతో తమ సంబంధాలు కొనసాగించేందుకు చివరి వరకు ప్రయత్నించామని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆదివారం చెప్పారు. ఎన్డీయేతో పొత్తు తెంచుకోవడంపై శరద్ యాదవ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. అనివార్యమైన పరిస్థితులలో 17 ఏళ్ల బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇటీవలి పరిణామాలతో తాము ఆవేదన చెందామన్నారు.

కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు తమను పునరాలోచించుకునేలా చేశాయన్నారు. తాము బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో కలిసి ఎన్డీయేను ఏర్పాటు చేశామన్నారు. గోవాలో తీసుకున్న నిర్ణయాలను తమను అసంతృప్తికి గురి చేశాయన్నారు. గోవా వేదికగా తీసుకున్న నిర్ణయాలలో తమను బిజెపి సంప్రదించలేదన్నారు. గోవా భేటీ తర్వాతే బిజెపిలో పరిస్థితులు మారాయన్నారు.

మోడీ ప్రమోషన్ ఇరుపార్టీల అజెండాను వమ్ము చేసిందని, అందుకే తాము ఎన్డీయేలో కొనసాగలేకపోతున్నామన్నారు. అందరితో సంప్రదించాకే బయటకు రావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. బిజెపితో తమ పొత్తు ముగిసిందన్నారు. తాను ఎన్డీయే కన్వీనర్ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అన్ని అంశాలు పరిశీలించి, అందరితో చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. తమ పార్టీలో అన్ని వర్గాల నేతలు ఉన్నారన్నారు.

19న విశ్వాస పరీక్ష: నితీష్

తమ పొత్తుకు పునాదులైన సిద్ధాంతాలు వీగడమే ఎన్డీయేలో నుండి వైదొలగడానికి కారణమని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. 2003లోను తమ మధ్య ఓసారి క్లిష్ట పరిస్థితులు వచ్చాయని చెప్పారు. వాస్తవ పరిస్థితులకు బిజెపి దూరమయిందన్నారు. మంత్రిమండలిలోను పొత్తి వీడే అంశంపై క్షుణ్ణంగా చర్చించామన్నారు. ఈ నెల 19న విశ్వాస పరీక్షకు అనుమతివ్వాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.

తాము బిహార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోదల్చుకోలేదన్నారు. ఈ నెల 19న విశ్వాసం ఉందో లేదో తేలుతుందన్నారు. బిహార్ రాష్ట్ర బిజెపి నేతలతో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. జాతీయ స్థాయిలోని కారణాలే బిజెపితో పొత్తు వీడేందుకు కారణాలన్నారు. ప్రధానమంత్రి కావాలంటే 270 మంది లోకసభ సభ్యుల మద్దతు కావాలని, అది బిజెపి ఒక్కదానికే సాధ్యం కాదని నితీష్ కుమార్ చెప్పారు.

వాజపేయి, అద్వానీల వల్లనే తాము ఎన్డీయేలో ఉన్నామని చెప్పారు. బిజెపిని తాము చర్చలకు ఆహ్వానించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బిహార్ అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. కలిసి పని చేసేందుకు బిజెపి మంత్రులు తిరస్కరించడం దురదృష్టకరమన్నారు. తమను ఎన్డీయే నుండి బయటకు వెళ్లేలా చేశారన్నారు. కాగా బిజెపి మంత్రులను నితీష్ కుమార్ మంత్రివర్గం నుండి తొలగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+