జగన్ కేసులో మరో ఛార్జీషీట్: ఆనం బ్రదర్స్‌పై కాపు ఫైర్

క్రిమినల్ కేసు 9లో జనని పెట్టుబడులపై ఛార్జీషీటును దాఖలు చేశారు. ఈ ఛార్జీషీటులో జగన్, ఆడిటర్ విజయ సాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ను నిందితులుగా పేర్కొన్నారు. జగన్ కేసులో వేర్వేరు అంశాలపై వేర్వేరుగా సిబిఐ ఛార్జీషీట్లు దాఖలు చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు మరొకటి దాఖలు చేసింది.
జగన్ రిమాండ్ పొడిగింపు
జగన్ ఆస్తుల కేసులో వైయస్ జగన్, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిల రిమాండును సిబిఐ న్యాయస్థానం జూలై 1వ తేది వరకు పొడిగించింది. మరోవైపు ఓఎంసి కేసులో కీలక సాక్షి శశి కుమార్‌కు ప్రభుత్వం ఫోర్ ప్లస్ ఫోర్ భద్రతను ఏర్పాటు చేసింది.
జగన్‌ను జైల్లో ఉంచడం కుట్ర కాదా?: కాపు
తమను కళంకిత మంత్రులు అంటేనే మంత్రులకు అంతగా కోపం వస్తుందని, అలాంటిది జగన్ కుటుంబంపై ఆనం సోదరులు ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి ప్రశ్నించారు. జగన్ నేరస్తుడు అని ఏ కోర్టు చెప్పక ముందే ఉరేయాలని ఆనం అనడం సరికాదని, జగన్ కుటుంబం మాట్లాడిన వారినే ఉరేయాలన్నారు. ఆనం, గీతా రెడ్డిలు చెప్పినట్లుగా జగన్ కేసులోని జివోలు అన్నీ సరైనవే అన్నారు.












Click it and Unblock the Notifications