డబ్బులు తీసుకున్న ప్రజలు ప్రశ్నిస్తారా?: రాయపాటి

Rayapati Sambasiva Rao
గుంటూరు: డబ్బులు తీసుకొని ఓట్లు వేసే ప్రజలు తమనేం ప్రశ్నిస్తారని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అభియోగం మోపిన కళంకిత మంత్రులందరినీ పదవుల నుంచి తప్పించాలని, ఇదే విషయాన్ని తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు.

తాను ముప్పై ఏళ్ల క్రితమే బెంజ్ కార్లో తిరిగానని, ఇవి తనకు కొత్త కాదన్నారు. ప్రజాప్రతినిధులుగా వచ్చిన రాజకీయ నాయకులకు పదేళ్ల కింద ఉన్న ఆస్తులెంత, ఇప్పుడెన్ని ఉన్నాయో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఓ మంత్రికి సంబంధించిన ఆస్తి వివరాలను సమాచార హక్కు చట్టం ప్రకారం కోరడంలో తప్పేముందన్నారు. రాజకీయాల్లో ఉన్న వారు వ్యాపారాలు చేయవద్దా అని ప్రశ్నించారు.

వ్యాపారాల్లో సంపాదించిన డబ్బులే ఓట్ల కోసం ఖర్చుపెడుతున్నామని చెప్పారు. వ్యాపారాలు చేసే వారు అవినీతికి పాల్పడరని, రాజకీయాల్లో ఉండి వ్యాపారాలు లేని వారే ఎలా సంపాదించగల్గుతున్నారని ప్రశ్నించారు. తద్వారా వ్యాపారాలు లేని రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతారని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్న వారు తమనేం ప్రశ్నిస్తారన్నారు. అందుకే తాము రేషన్ షాపులు, ఇలా ఏది దొరికితే అది అమ్ముకొని సంపాదించుకుంటున్నామన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి గెలిపించాలన్నారు.

గత నెలలో కూడా రాయపాటి ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. మార్పు అనేది రాజకీయ నాయకులలో కాదని మొదట ప్రజలలో రావాలని, రూ.500 తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తే రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు అనేది నాయకులలో రాదని, ప్రజల నుండే మార్పు రావాలన్నారు. ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు వేయడం మానుకోవాలని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+