చైనాలో ఆంధ్రుడు మిస్: భార్యను హత్య చేసిన వ్యక్తి

Murder
విజయవాడ/ విశాఖపట్నం/ ఒంగోలు : విశాఖపట్నం నగరానికి చెందిన యువకుడు వెంకటేష్ చైనాలో అదృశ్యమయ్యాడు. డిసెంబర్‌లో చైనాకు వెళ్లిన వెంకటేష్ జనవరి 5వ తేదీ నుంచి కనిపించడం లేదు. తమ కుమారుడి అదృశ్యంపై తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటేష్ తల్లిదండ్రులు విశాఖపట్నంలోని అల్లీపురం వెంకటేశ్వరమెట్టలో నివసిస్తున్నారు.

కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని యనమలకుదురులో దారుణం జరిగింది. పిల్లలు కలగలేదని ఓ భర్త భార్యకు విషమిచ్చి హత్య చేశాడు. విషయం తెలిని మృతురాలి బంధువులు నిందితుడికి శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం తోకపల్లిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆగివున్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి మృతి చెందారు. ఆయన మృతి పట్ల మంత్రి మహీధర్‌రెడ్డి సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+