ప్రధాని: నితీష్‌కు పొగడ్తలు, నరేంద్ర మోడీపై విసుర్లు

యుపిఎ మూడోసారి అధికారంలోకి వస్తుందని, ప్రజలకు తమపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ వచ్చినా తమకు భయం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ప్రశంసించారు. రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు.
రాహుల్ గాంధీ సహజసిద్ధమైన నాయకుడని, యుపిఎకు నాయకుడు కాగలడని ఆయన అన్నారు. నితీష్ కుమార్ లౌకికవాది అని ఆయన అన్నారు. సరైన వ్యక్తుల సహకారాన్ని కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ కోరిందని ఆయన చెప్పారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మన్మోహన్ సింగ్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగింది. ఆదివారం పార్టీ సంస్థాగత మార్పులు చేసింది. ఆ తర్వాత సోమవారం మన్మోహన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు.












Click it and Unblock the Notifications