తెలంగాణపై వైఖరి: చిరంజీవి మార్గంలోనే కావూరి

ప్రత్యేక తెలంగాణ అంశంపై తాను ఇంత వరకు వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ వ్యక్తిగతమని, ఇపుడు కేంద్ర మంత్రిగా విశాలదృక్పథంతో ముందుకు సాగుతానని కేంద్ర జౌళిశాఖామంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై తన అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఇకపై మాత్రం కేంద్ర మంత్రిగా విశాల జాతీయ దృక్పథంతో పనిచేస్తానని చెప్పారు.
తెలంగాణ అంశం ఎఐసిసి పరిధిలో ఉందని చెప్పారు. అందువల్ల పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంతా గౌరవించాలని ఆయన అన్నారు. తనపై విశ్వాసముంచి కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించినందుకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్‌గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు.
కాస్త ఆలస్యంగానైనా తన సమర్థతను గుర్తించి కేబినెట్ హోదా కట్టబెట్టినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే యుపిఎ ప్రభుత్వ పదవీ కాలం మరో యేడాది కూడా లేకపోవడంతో ఈ తక్కువ సమయంలోనే తన ఆలోచనలు అమలు చేసేందుకు కృషి చెస్తానని ఆయన చెప్పారు. తనకు పని చేయడం అలవాటు అని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications