వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో లింక్ లేదు: సాక్షి డైలీపై కిరణ్ మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తన మాటలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రిక వక్రీకరించిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. జగన్‌తో తనకు సంబంధాలను అంటగడుతూ తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన ఆరోపణలపై ఆయన బుధవారం శానససభలో ప్రతిస్పందించారు. తమ పార్టీలో లేనివారితో తాము సంబంధాలు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేసారు. తెలుగుదేశం పార్టీని ఎలా ప్రత్యర్థిగా చూస్తామో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కూడా అలాగే చూస్తామని ఆయన అన్నారు.

వైయస్ జగన్ కేసులో తమ మంత్రులపై వచ్చిన ఆరోపణలపై తాను చెప్పిన మాటలను వక్రీకరిస్తూ తాను కేసే లేదన్నట్లుగా మాట్లాడినట్లు సాక్షి డైలీ చిత్రీకరించిందని ఆయన అన్నారు. తాము ఒక పార్టీలోనే కొనసాగుతామని, సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి హయాంలోని ఐఎంజి వ్యవహారాన్ని తానే సభలో లేవనెత్తానని, ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు సిఫార్సు చేసిందని, సిబ్బంది లేకపోవడంతో సిబిఐ దాన్ని దర్యాప్తునకు తీసుకోలేదని, ఇప్పటికి కూడా సిబిఐ దర్యాప్తునకు అడగవచ్చునని ఆయన అన్నారు.

తాను సీనియర్ సభ్యుడిని అంటే సరిపోదని, సభలో వారి నుంచి కొత్త సభ్యులు నేర్చుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. పరస్పరం దూషించుకుంటున్నప్పుడు మన స్థాయిని తగ్గించుకుంటున్నామని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. చార్జిషీట్లలో తమ పేర్లను సిబిఐ చేర్చిన తర్వాత మంత్రులు రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. క్విడ్ ప్రోకో అంశం మంత్రులపై రాలేదని, మంత్రులు తీసుకున్న నిర్ణయాల వల్ల వేరేవారికి లబ్ధి చేకూరిందనే అంశంపై చర్చ సాగుతోందని తాను చెప్పినట్లు ఆయన వివరించారు. తాను వేరేవాళ్ల ప్రస్తావన తేలేదని ఆయన చెప్పారు. అయినా సాక్షి డైలీ తన మాటలను వక్రీకరించిందని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని, ఈ స్థితిలో పెట్టుబడులు తీసుకోవడం నైతికమా, అనైతికమా అనే చర్చ సాగుతోందని ఆయన అన్నారు. మంత్రులు ప్రలోభాలకు లోను కాలేదని, మంత్రులకు ఆ విషయంలో మేళ్లు జరగలేదని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. తాను జగన్ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై మాట్లాడలేదని చెప్పారు.

ముఖ్యమంత్రి వివరణ తర్వాత మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బంగారుతల్లి పథకం బిల్లును శాసనసభలో ప్రతిపాదించారు.

English summary
Condemning YSR Congress party president YS Jagan's Salshi daily report, CM Kirab kumar Reddy said that he never mentioned about YS Jagan and investments in his companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X