తెలంగాణపై చర్చలు: చాకో, కాంగ్రెసు డ్రామా: కోదండ

తమకు ప్యాకేజీలు వద్దని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతల సమావేశం ఓ డ్రామా అని ఆయన వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే పార్టీ అధిష్టానంతో కొట్లాడాలని ఆయన సూచించారు.
జూలై 4వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులను పల్లెల్లో తిరగనీయకుండా చేస్తామని ఆయన చెప్పారు. బైండోవర్ల పేరుతో కేసులు నమోదు చేశారని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ కోసం శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడిని నిర్వహిస్తే తెలంగాణ ప్రజలను హైదరాబాద్ రాకుండా బైండోవర్లు చేసి అడ్డుకున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications