కాశ్మీర్‌లేని భారతా?: కిషన్, సిఫార్స్‌చేస్తాం: 'టి'జి ఎద్దేవా

కాశ్మీర్ లేకుండా భారత్ చిత్రాన్ని ముద్రించడం దేశ ద్రోహ చర్య కిందకే వస్తుందన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసన సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. వాయిదాల పేరిట సభను వాయిదా వేసి తప్పించుకున్నారన్నారు. పనికిమాలిన పథకాలు ప్రవేశపెట్టి, వాటి ప్రచారానికే ముఖ్యమంత్రి పరిమితమయ్యారన్నారు.
టిజి వెంకటేష్ ఎద్దేవా
ఉత్తరాఖండ్‌లో తెలుగు ప్రజల ఇబ్బందుల దృష్ట్యా సభను వాయిదా వేశామని మంత్రి టిజి వెంకటేష్ చెప్పారు. తెలంగాణకు ప్యాకేజీ ఇస్తే స్వాగతిస్తామని చెప్పారు. సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తెలంగాణ డిమాండ్ రాజరీకం కోరుకునే వారిదే అన్నారు. ముఖ్యమంత్రి పదవే కాకుండా రాష్ట్రపతి, ఐరాస సెక్రటరీ పదవిని కూడా తెలంగాణ వారికే ఇవ్వాలని సిఫార్సు చేస్తామని ఎద్దేవా చేశారు.
కాగా సభను నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. రెండు విడతలు కలిపి బడ్జెట్ సమావేశాలు ఇరవై రోజులు జరిగాయి. 57 గంటల 29 నిమిషాలు సభ జరిగింది. 16 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. 14 బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 7కమిటీ రిపోర్టులను ప్రవేశ పెట్టింది. చర్చల్లో 96 మంది సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఒక అంశంపై, మంత్రులు రెండు అంశాలపై స్టేట్‌మెంట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications