Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫొటోలు: బయటపడడం అద్భుతమే, వారే హీరోలు

డెహ్రూడూన్‌: ఉత్తరాఖండ్ వరదల నుంచి బతికి బయటపడడాన్ని చాలా మంది ఒక అద్భుతంగానే భావిస్తున్నారు. ప్రభు కేదార్‌నాథ్ దయ వల్ల తాము జీవించి ఉన్నామని కొంత మంది చెబుతుండగా, ఐటిబిపి, ఐఎఎఫ్ బలగాల సిబ్బంది, సైనికులు చూపిన నిబద్ధత, సాహసం, మనో ధైర్యం తమను కాపాడిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను కాపాడడానికి ముందు రంగంలోకి దిగిన హీరోలు భారత సైనికులే.

భారత సైనికులు భీకరమైన, భయంకర పరిస్థితిలో ఎనలేని తెగువ చూపారు. రాజకీయాలు, ఒత్తిళ్లు వారిని అంటలేదు. వాతావరణం సహకరించకపోయినా, భౌగోళిక స్థితిగతులు ఆటంకంగా మారినా వారు తమ నిబ్బరాన్ని, విధి నిర్వహణను వదిలిపెట్టలేదు. కొండ చరియలు విరిగి పడుతుంటే, వరదలు ఆడ్డు వస్తే కూడా వారు లెక్క చేయలేదు. దాదాపు 35 వేల మందిని సురక్షితంగా బయటకు తరలించారు.

ఫొటోలు: బయటపడడం అద్భుతమే

వరద తాకిడి నుంచి బయట పడి చెన్నై విమానాశ్రయం చేరుకున్న యాత్రికులు..

ఫొటోలు: బయటపడడం అద్భుతమే


వరద తాకిడి ప్రాంతాల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన యాత్రికులు ఇండోర్ విమానాశ్రయంలో ఇలా..

ఫొటోలు: బయటపడడం అద్భుతమే

వరద తాకిడి ప్రాంతం నుంచి దేశీయ విమానంలో గురువారం ముంబై విమానాశ్రయం చేరుకున్న యాత్రికుడి మొహంలో ఇలా నవ్వు విరిసింది.

ఫొటోలు: బయటపడడం అద్భుతమే

కేదార్‌నాథ్‌లో గుడి తప్ప ఏమీ మిగలలేదు. కేదార్‌నాథ్ స్మశానంలా కనిపిస్తోంది.

ఫొటోలు: బయటపడడం అద్భుతమే

పెద్ద గండం నుంచి బయటపడిన ప్రజలు సురక్షిత ప్రాంతానికి చేరుకున్న తర్వాత బతుకు జీవుడా అనుకుంటున్నారు.

ఫొటోలు: బయటపడడం అద్భుతమే

ఉత్తరఖండ్ ప్రకృతి విపత్తుకు విలవిలలాడుతోంది. బాధితుల రోదన చెప్పనలవి కాకుండా ఉంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి

ఫొటోలు: బయటపడడం అద్భుతమే

బాధితులను హెలికాప్టర్‌లో తరలిస్తున్న దృశ్యం.. హరిద్వార్‌లో శుక్రవారం 40 శవాలు బయటపడ్డాయి.

ఫొటోలు: బయటపడడం అద్భుతమే

వరద, వర్షం తాకిడి ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించడానికి ఉత్తరాఖండ్‌లో 40 హెలికాప్టర్లను వాడుతున్నారు.

ఫొటోలు: బయటపడడం అద్భుతమే

ఇంత దారుణమైన ప్రకృతి విపత్తును ఎన్నడూ చూడలేదని, కోలుకోవడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని ఉత్తరాఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారు.

తాము ఇదంతా దేశం కోసం చేస్తున్నామని, ఒక్కో ప్రాణాన్ని కాపాడుతుంటే పతకం గెలిచినంత సంతృప్తిగా ఉందని, వీరంతా తమ కుటుంబ సభ్యులని ఓ సైనికుడు వ్యాఖ్యానించాడు. హెలికాప్టర్ల ద్వారా ముందు మహిళలను, పిల్లలను తరలించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు, బతికి ఉన్నవారినంతా సురక్షితంగా తరలించిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఇఁడో - టిబెటన్ బోర్డర్ పోలీసు చీఫ్ అజయ్ చద్దా అన్నారు.

సైనికాధికారులు కొంత మంది వరద తాకిడి ప్రాంతాల్లో చిక్కుపడినవారిని తరలించేందుకు పనిచేస్తుంటే, మరికొంత మంది పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఆహారం, మందులు ఇచ్చే పని చేస్తున్నారు. సైనికులు పిల్లలను ఎత్తుకుని సురక్షితంగా బయటకు తెస్తున్నారు. బాధితులను ఓదారుస్తున్నారు. వారికి నమ్మకం కలిగిస్తున్నారు.

ప్రకృతి విపత్తుల్లో చిక్కుకుని బయటపడినవారిలో విపరీతమైన భయం చోటుచేసుకుంటుందని, దాన్ని తొలగించడం కూడా అవసరమని వారు అభిప్రాయపడి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. తమకు చాలా సహనం కావాల్సి వస్తుందని ఓ సైనికుడు అన్నాడు.

రుద్రప్రయాగ్, చమోలి, కేదార్‌నాథ్, గోవింద్‌ఘాట్ తీవ్రంగా దెబ్బ తిన్నట్లు సహాయక చర్యలను చేపట్టిన అధికారులు అంటున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 43 సైనిక హెలికాప్టర్లు, 13 విమానాలు వాడుతున్నారు. సైనికులు చూపిస్తున్న తెగువ, చేస్తున్న సహాయం మరిచిపోలేనిదని షర్మిల అనే మహిళ వ్యాఖ్యానించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+