వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ బీభత్సం: 17 మంది విదేశీయులు సేఫ్

By Pratap
|
Google Oneindia TeluguNews

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న 17 మంది విదేశీ యాత్రికులను సహాయక బృందాలు సురక్షితంగా తరలించాయి. ధరసులో చిక్కుకుపోయిన వారిని సహాయ బృందాలు బయటకు తీసుకుని వచ్చాయి. కాగా, కేదార్‌నాథ్, గౌరీకుండ్ మధ్య దాదాపు వేయి మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. వాతావరణం సహకరించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలకు చిక్కులు ఎదురవుతున్నాయి.

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సహాయక చర్యలను పర్యవేక్షించి, ముఖ్యమంత్రి విజయ బహుగుణతో సమీక్షించడానికి శనివారం ఇక్కడికి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో పడి ఉన్న మృతదేహాలను లెక్కించడానికి ఎనిమిది మందితో కూడిన నిపుణుల బృందం కేదార్‌నాథ్ వెళ్లినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వర్గాలు చెప్పాయి.

 Uttarakhand

వాతావరణం సరిగా లేకపోవడంతో హెలికాప్టర్ ఆపరేషన్స్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో జాప్యం జరుగుతోంది. రుద్రప్రయాగ్, చమోలి, ఉత్తరకాశీ జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని మోడీ నిర్ణయించుకున్నారు.

రాంబారా, జంగల్‌చట్టి ప్రాంతాల్లో వేయి మంది యాత్రికులు చిక్కుపడి పోయారు. రుద్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్‌కు వచ్చే మార్గంలో అవి ఉన్నాయి. ఆకలితో వారు అలమటిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు సమాచారం. సహాయక చర్యల్లో ఇప్పటికే 40 హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. కాగా, రాజస్థాన్ ప్రభుత్వం రెండో హెలికాప్టర్లను, 30 బస్సులను పంపించింది.

గుజరాత్ ప్రభుత్వం రెండు విమానాలను సహాయక చర్యలకు నియోగించింది. ఒక్కో దాంట్లో 140 మందికి చోటు ఉంటుంది. గుజరాత్ యాత్రికుల కోసం శాంతికుంజ్ హరిద్వార్‌లో పునరావాస శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

English summary
Evacuation of stranded people from flood-hit areas of Uttarakhand today picked up pace with security forces rescuing 17 foreign tourists from Dharasu and sighting 1000 pilgrims stuck between Kedarnath and Gaurikund even as bad weather hampered chopper operations at some places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X