ఔటర్ రింగ్ రోడ్డులో కార్లో మంటలు, వ్యక్తి సజీవ దహనం

గంజాయి పట్టివేత
వరంగలర్ జిల్లా హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తుపాకితో బెదిరించి దోపిడీ
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులోని ఓ రైస్ మిల్లులోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించి రూ.6 లక్షలు దోచుకున్నారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
రైతు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఈ తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి వస్తుండగా రోడ్డుపై విద్యుత్ వైరు తెగి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సింగపేట పొలాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ రైతు సజీవ దహనమయ్యాడు.












Click it and Unblock the Notifications