చాల్లే కూర్చో: బస్వరాజు ఆగ్రహం, దానంకు కోపమొచ్చి..

దీంతో బస్తీవాసులు అసెంబ్లీలో ఉన్న మంత్రి దానంకు జరిగిన విషయం తెలియజేశారు. ఆయన అసెంబ్లీ నుంచి తిన్నగా వివాదం జరుగుతున్న చోటికి వచ్చారు. అక్కడ అప్పటికే ఎడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంత్రి అక్కడికి చేరుకుని ఆపమంటే ఆపవేమిటని పోలీసుల సమక్షంలోనే బుల్‌డోజర్ డ్రైవర్‌ను కాలితో తన్నారట. గతంలో కూడా ఇస్కాన్ వివాదంలో ఎస్ఐపై మంత్రి చెయ్యి చేసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మరో మంత్రిగారికీ కోపమొచ్చింది
చేతి వృత్తిదారుల సమస్యలపై నిలదీసినందుకు మరో మంత్రిగారికి కోపమొచ్చింది. ఇది శనివారం జరిగింది. సుందరయ్య కళానిలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సమీక్షా సమాశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజక సంఘం నేత మాట్లాడుతూ... ప్రభుత్వం వృత్తిదారుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని, నిధులు విడుదల చేయడం లేదన్నారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ.. 'నీకి పనీపాటా లేదు. గొడవలు చేయడమే నీ పని. నాకు అంతా తెలుసు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు రజకుల సభ్యత్వం, దోభీ ఘాట్ల నిర్మాణం పేరుతో వసూళ్లకు పాల్పడ్డవు. చాలు చాల్లేవయ్యా కూర్చో. నువ్వు ఒక్కడివే నాయకుడివా అంటూ' ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications