తెలంగాణవాదం ఎఫెక్ట్: జగన్‌కు జలగం వెంకట్రావు షాక్?

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఖమ్మం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి పరాజయం పాలైన అనంతరం కాంగ్రెస్ అధిష్ఠానం వెంకట్రావును సస్పెండ్ చేసింది. దీంతో కొన్నాళ్లకు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం, ఖమ్మం ఎంపి అభ్యర్థి ఆయనేనన్న ప్రచారం సాగుతుండటంతో మనస్తాపానికి గురైన జలగం, తిరిగి కాంగ్రెసు తీర్థం పుచ్చుకోవాలనే యోచనలో ఉన్నారటత
ఇటీవల ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. వైయస్సార్ కాంగ్రెసు పట్ల అసంతృప్తిగా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోందంటున్నారు. వైయస్ జగన్ సోదరి షర్మిల ఖమ్మం పాదయాత్రలో ఆయన అసంతృప్తి బయటపడింది. జలగం వెంకట్రావు అనుచరులు షర్మిల సభకు వచ్చి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడంతో షర్మిల తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు.
తెలంగాణ ప్రాంతంలో తెలంగాణవాదం బలపడుతుండటంతో ఆయన తెరాస వైపు వెళ్తారనే వాదనలు వెలువడ్డాయి. అయితే తనకు వైయస్సార్ కాంగ్రెసులో తగిన ప్రాధాన్యం లభించడం లేదని భావిస్తున్న అతను కాంగ్రెసులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఖమ్మం జిల్లాలో తెలంగాణవాదం తక్కువగా ఉందని, అందుకే ఆయన కాంగ్రెసులో చేరవచ్చునని అంటున్నారు. జలగం చేరికను రేణుకా చౌదరి కూడా వ్యతిరేకించలేదని సమాచారం.












Click it and Unblock the Notifications