తెలివుంటే ఎప్పుడో: అధిష్టానంపై పాల్వాయి తీవ్ర వ్యాఖ్య

తెలంగాణ అంశంపై తెరపైకి వచ్చినప్పుడల్లా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పిచ్చోళ్ల మాదిరిగా సమైక్యాంధ్రను తెర పైకి తీసుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అంశం వచ్చినప్పుడు కౌంటర్‌గా సమైక్యాంధ్ర అనడం సరికాదన్నారు. తెలంగాణ ఇవ్వని పక్షంలో గ్రామాల్లో ప్రచారం చేయలేని పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతిని కోరుకుంటున్నారు: లగడపాటి
తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రస్తుతం శాంతిని కోరుకుంటున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీ ఇస్తే తాము స్వాగతిస్తామన్నారు. అలాగే సీమాంధ్ర ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని కోరుతామన్నారు.
భావోద్వేగాల వల్ల తామే నష్టపోతున్నామనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన చలో అసెంబ్లీకి, బందుకు, ఆ పార్టీ ఉద్యమాలకు స్పందన కరువైందని ఆయన విమర్శలు గుప్పించారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ దండుకుంటున్నారని, ఈ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు.












Click it and Unblock the Notifications