కెటిఆర్ మగాడైతే విచారణ కోరాలి: రాజేంద్రప్రసాద్

తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్‌తో కుమ్మక్కయారని ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వర రావు ఆరోపించారు. శనివారం ఆయన ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. కెటిఆర్‌ను రక్షించుకునేందుకే తెరాస నేతలు శాసన సభలో మౌనం పాటించారన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం ఖాయమన్నారు.
సెటిల్మెంట్లపై బిజెపి పరోక్ష స్పందన
తెలంగాణ ఉద్యమంలో సెటిల్మెంట్ల వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలు చోటుచేసుకోవడం సరైంది కాదని బిజెపి వ్యాఖ్యానించింది. ఇలాంటి కార్యకలాపాలు సాగించే వ్యక్తులు, శక్తులను తెలంగాణ ప్రజలు అంగీకరించరని పరోక్షంగా కల్వకుంట్ల తారక రామారావును ఉద్దేశించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు.
తెలంగాణ ఉద్యమం తీవ్ర దశలో ఉందన్నారు. ఈ సమయంలో ఉద్యమాన్ని సంపూర్ణ సమతౌల్యంతో నడపాలని, సెటిల్మెంట్ల వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలు ఉద్యమానికి మంచిది కాదన్నారు. వీటికి పాల్పడే ప్రజాస్వామిక వ్యతిరేక శక్తులను తెలంగాణ ప్రజలు అంగీకరించన్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన దిగ్విజయ్‌సింగ్ తెలంగాణకు బద్ధవ్యతిరేకి అని, తెలంగాణ అంశాన్ని మరుగున పెట్టేందుకే కాంగ్రెస్ మళ్లీ ఆయనను ఇన్‌చార్జిగా నియమించిందని ఆరోపించారు. పులిచింతల క్యాచ్‌మెంట్ ఏరియాలో ముంపునకు గురవుతున్న నల్గొండ జిల్లాలోని 11 గ్రామాలకు పరిహారం ఇచ్చాకే, నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications