మూడోసారి మేమే: చిరు, ఎగబడ్డ ఫ్యాన్స్, చెర్రీ అట్రాక్షన్

Chiranjeevi - Ram Charan
గుంటూరు/విశాఖపట్నం: 2014 ఎన్నికల్లో గెలిచి కాంగ్రెసు పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆదివారం అన్నారు. ఆయన గుంటూరు పట్టణ కార్యాలయంలో మాట్లాడారు. స్థానిక కాంగ్రెసు నాయకులతో చిరంజీవి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. కాంగ్రెసు మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమని కార్యకర్తలకు చెప్పారు. అవినీతిపరులకు ఎప్పటికైనా అంతం తప్పదన్నారు.

రైతు ముఖంలో ఆనందం ఉంటేనే అభివృద్ది జరిగినట్లని చిరంజీవి అభిప్రాయపడ్డారు. చిరు, బొత్సలు గుంటూరు జిల్లా తాడికొండలో ఏర్పాటు చేసిన ఏరువాక, పొంగళ్ల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో హరిత విప్లవం సాధ్యమవుతోందన్నారు.

చిరు కోసం ఎగబడిన అభిమానులు, నేతల ఉత్సాహం

ఏరువాక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చిరంజీవి నాగలి ఎత్తకుండానే వెనుదిరాగాల్సి వచ్చింది. తాడికొండలోని ఏరువాక కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడంతో భారీగా అభిమానులు, స్థానిక పార్టీ నాయకులు తరలి వచ్చారు. చిరంజీవిని చూసేందుకు అందరూ ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది.

అభిమానులు చిరును కలిసి కరచాలనం చేయాలని, స్థానిక నాయకులు ఆయనను సన్మానించి, ఆయన దృష్టిలో పడాలని ఎగబడ్డారు. దీంతో చిరంజీవి నాగలి ఎత్తకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. బొత్స సత్యనారాయణ కూడా వెనుదిరిగారు.

చెర్రీకి ప్రధాన్యత

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజకు విశాఖలో జరిగిన ఒలింపిక్ డే రన్ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. విశాఖలో గిన్నిస్ బుక్ రికార్డ్ ధ్యేయంగా ఒలంపిక్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ అతిథిగా వచ్చారు. చెర్రీ ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారిపోయారు. చెర్రీని ముఖ్యమంత్రి, మంత్రులు నిలబడి రిసీవ్ చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+