డబ్బుల కోసమే: టీవిల్లో అశ్లీల చర్చలపై మమత ఫైర్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మీడియాపై ఒకింత అసహనం ప్రదర్శించారు. శుక్రవారం ఆమె మండిపడ్డారు. ఇటీవల టీవి ఛానళ్లలో అశ్లీల చర్చలు జరుగుతున్నాయని మమతా బెనర్జీ మండిపడ్డారు.

ఇటీవల రాష్ట్రంలో రెండు మూడు అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని కానీ, తానంటే గిట్టని కొందరు టివీలలో అశ్లీల చర్చల్లో పాల్గొంటున్నారని మమత అన్నారు. మన తల్లులను, అక్కాచెల్లెళ్లను కించపరిచేలా ప్రతిరోజు సాయంత్రం కొందరు న్యూస్ ఛానళ్లలో చర్చలో పాల్గొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Mamata Banerjee

ఇలా లైంగిక చర్చలు జరపడం సరికాదన్నారు. కొన్ని దివాళా తీసిన ఛానళ్లు బెంగాల్ ప్రజలను అవమానపరుస్తున్నాయని, వాళ్లు తప్పు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఏమీ తెలియని చిన్న పిల్లలను చెడగొడుతున్నారని, ఇలాంటి వాళ్లను చర్చకు ఎవరు పిలుస్తున్నారని ప్రశ్నించారు.

వాళ్లు సామాజిక కార్యకర్తలుగా చెప్పుకొంటూ డబ్బు కోసమే ఈ పని చేస్తున్నారని, ఈ కార్యక్రమాలన్నీ డబ్బుల కోసమేనని ధ్వజమెత్తారు. కాగా అత్యాచార ఘటన జరిగిన ఓ ప్రాంతానికి మమతా బెనర్జీ ఇటీవల పరామర్శకు వెళ్లారు. స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె తనను అడ్డుకున్న తర్వాత టీవి ఛానళ్లలో రేప్ ఘటనల చర్యలపై ఆమె పై విధంగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+