జైల్లో నిమ్మగడ్డను కలిసిన నటుడు జగపతిబాబు

కాగా, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో చంచల్‌గుడా జైలులోనే ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని కర్ణాటక శాసనసభ్యుడు వి. శ్రీరాములు కలిశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డిని ఆనయ కుటుంబ సభ్యులు కలిశారు.
నిమ్మగడ్డ ప్రసాద్‌ను చంచల్‌గుడా జైలులో సినీ ప్రముఖులు కలవడం కొత్తేమీ కాదు. గతంలో పలు మార్లు హీరో అక్కినేని నాగార్జున ఆయనను కలిశారు. ఆ మధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆయనను కలిశారు. నిమ్మగడ్డ ప్రసాద్ తనకు మంచి మిత్రుడని, అందుకే తరుచుగా కలుస్తుంటానని నాగార్జున మీడియా ప్రతినిధులతో అప్పట్లో అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను నిరుడు మే 15వ తేదీ సాయంత్రం సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు విచారించిన అనంతరం సిబిఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. జగన్ ఆస్తుల కేసులో నిమ్మగడ్డ 12వ నిందితుడు. జగన్‌కు చెందిన వ్యాపార సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ దాదాపు రూ. 504 కోట్లు పెట్టినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications