కేదార్‌నాథ్ గుడి గంటకు వేలాడతూ 9 గంటలు
డెహ్రడూన్: నీళ్లలో శవాలు కొట్టుకుపోతుంటే ఓ యాత్రికుడు దాదాపు 9 గంటల పాటు కేదార్‌నాథ్ ఆలయం గంటకు వేలాడుతూ ప్రాణాలను దక్కించుకున్నాడు. తెహ్రీకి చెదిన విజేందర్ సింగ్ నేగి అనే యాత్రికుడు గుడి గంటను పట్టుకుని గొంతు లోతు నీటిలో వేలాడూతూ ప్రాణాలు కాపాడుకున్నాడు.
అలా బతికి బయటపడిన నేగీ ఇప్పటికీ భయంతో వణికిపోతున్నాడు. బతికి తిరిగి రావడం ఓ అద్భుతమేనని అంటూ నేగీ బావ గంగా సింగ్ భండారీ అన్నాడు. అతను ఎలా బయటపడింది వివరించాడు. ప్రకృతి ప్రకోపం సంభవించినప్పుడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గంటకు వేలాడుతూ ఉన్నాడని చెప్పాడు.

కొట్టుకుపోకుండా ఉండడానికి శవాలపై నిలుచున్నాడని, భారీ తరంగాల తాకిడికి బట్టలు చిరికిపోయాయని, చివరకు ఎలాగో బతికి బయటపడ్డాడని చెప్పాడు. కేదార్‌నాథ్ ఆలయం పక్కనే భండారీ హోటల్ ఉంది. నేగీ కళ్ల ముందే కొట్టుకుపోయింది. ఆ భవనం నుంచి నేగీ బయటకు దూకి గుడి గంటను పట్టుకున్నాడు.
తొమ్మిది గంటల పాటు గంటను పట్టుకోవడం వల్ల నేగీ చేతులు చీరుకుపోయాయి. గంటల తరబడి గంటను పట్టుకుని వేలాడడం కూడా కష్టంగానే ఉంది. ఎప్పుడు చేతులు జారిపోతాయో కూడా తెలియని పరిస్థితి. శవాలు పక్కన నుంచే కొట్టుకుపోతున్నాయి. నీటి మట్టం తగ్గిన తర్వాత అడవిలో రెండు రోజుల పాటు పడిపోయాడు. హెలికాప్టర్ అతన్ని రక్షించింది. తేహ్రీలోని కుటుంబ సభ్యులు అతన్ని చూసి వలవలా ఏడ్చేశారు. అతనికి చిన్న పిల్లలున్నారు. దేవుడి దయవల్లనే తాను బతికి బయటపడ్డానని అతను అన్నాడు.












Click it and Unblock the Notifications