పొన్నాల కేసు రిజర్వ్, ధర్మానపై సుప్రీం కోర్టుకు సిబిఐ

పొన్నాల లక్ష్మయ్య 2009లో కాంగ్రెసు పార్టీ తరఫున జనగామ నియోజకవర్గం నుండి నాటి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పైన 236 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే అంతకుముందే 44 ఓట్లతో కొమ్మూరి గెలిచినట్లు ప్రకటించిన అధికారి, ఆ తర్వాత పొన్నాల 236 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
గతంలో ఈ కేసు విషయమై పొన్నాల పలుమార్లు కోర్టుకు హాజరయ్యారు. కొమ్మూరి పిటిషన్ పైన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. దీంతో హైకోర్టులో విచారణ జరిగింది. కొమ్మూరి తరఫు లాయర్ పొన్నాలను క్రాస్ ఎగ్జామిన్ కూడా చేశారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును ఈ రోజు రిజర్వ్ చేశారు.
ధర్మాన వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్న సిబిఐ
వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు వ్యవహారంపై సుప్రీం కోర్టును సిబిఐని ఆశ్రయించనుంది. ధర్మానపై నమోదైన పిసి యాక్టులను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంను కోరనుంది. ఇదే విషయాన్ని ట్రయల్ కోర్టుకు తెలిపింది. ధర్మాన ప్రాసిక్యూషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సీబీఐ సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications