కిరణ్ అడ్డుకునే అవకాశం: కెకె, తేల్చాలని శైలజానాథ్

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నుండి వలసలను ఆపేందుకే కాంగ్రెసు పార్టీ తెలంగాణపై చర్చ అంటూ చెబుతోందని పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రజలు ప్యాకేజీని కోరుకోవడం లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ ప్రజలు ప్యాకేజీని కోరుకోవడం లేదని తెరాస నేత వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాదు రాజధానితో, పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప తెలంగాణ ప్రజలు దేనిని అంగీకరించరన్నారు. ప్యాకేజీ ఇస్తే కాంగ్రెసు పార్టీ ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్యాకేజీల అవసరం సీమాంధ్ర నేతలకే ఉందని, తమకు లేదన్నారు.
సమైక్యమే కోరుకుంటున్నా: శైలజానాథ్
రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను కోరుకుంటున్నానని మంత్రి శైలజానాథ్ అన్నారు. తెలుగువారు సమైక్యంగానే ఉండాలన్నారు. ప్యాకేజీలు, విభజన అన్నీ ఒట్టి ఊహాగానాలు మాత్రమేనన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని అధిష్టానం త్వరగా తేల్చితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications