కెసిఆర్ ఆస్తులపై పిటిషన్: నా చెప్పుంటుందన్న రమ్య

కెసిఆర్ పైన రమ్య ఫైర్
కెసిఆర్ ఇంటి ఎదుట జరిగే చావు డప్పు - లక్ష చెప్పుల కార్యక్రమంలో తన చెప్పు కూడా ఉంటుందని తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ నేత, ఆయన అన్న కూతురు రమ్య మంగళవారం ఓ ఛానల్‌తో వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వరదల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన భక్తులు మృతి చెందినా కెసిఆర్ కనీసం సంతాపం తెలుపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం మృతి చెందిన వారి ఆత్మలు ఫామ్ హౌస్ చుట్టు తిరుగుతున్నాయని విమర్శించారు. పలువురు మహిళలు కెసిఆర్‌ను కలిసేందుకు ఫాం హౌస్‌కు వెళ్తే అనుమతి నిరాకరించి అవమానించారని ఆరోపించారు.
అన్ని పార్టీలు ఏకం కావాలి: సురవరం
తెలంగాణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో ఉన్నారు. సిపిఐ రాష్ట్ర సమావేశాలు యాదగిరి గుట్టలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని అన్నారు. యూపిఏ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోకుండా కార్పోరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందన్నారు.












Click it and Unblock the Notifications