వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క రోజు వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు: చిరుపై ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Erravelli Dayakar Rao and Chiranjeevi
వరంగల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులకు సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. బాధితుల పరామర్శకు కేంద్ర మంత్రి చిరంజీవి ఒక్క రోజు వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది అసమర్థ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌ యాత్రకు వెళ్లిన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ వీడి పార్లమెంటులో తెంలగాణ కోసం పోరాడాలని ఆయన అన్నారు.

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆర్‌సీ శశాంక్ గోయల్ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ వరదబాధితుల కోసం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తొలగించడం తప్పేనని ఆయన అన్నారు. ఇందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఉత్తరాఖండ్ యాత్రకు రాష్ట్రం నుంచి ఎంత మంది వెళ్లారనేది కచ్చితమైన వివరాలు లేవని మంత్రులు శ్రీధర్ భాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మానవతా దృక్పథంతో సేవ చేస్తే తప్పు లేదని, రాజకీయ ప్రయోజనం పొందడానికి ఇది సమయం కాదని వారన్నారు. యాత్రికులను వదిలేసి వచ్చిన ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని వారన్నారు.

English summary

 The Telugudesam Telangana forum convenor Erravelli Dayakar Rao opposed union minister Chiranjeevi attitude towards Uttarakgand flood victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X