వైయస్ విజయమ్మ యాత్రలతో జోరు పెరుగుతుందా?

YS Vijayamma
హైదరాబాద్‌: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల ఓ వైపు రికార్డు స్థాయిలో పాదయాత్ర చేస్తుంటే, ప్రాంతీయ సదస్సుల ద్వారా నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి వైయస్ విజమయ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వైయస్సార్ కాంగ్రెసు ప్రత్యర్థులను ఢీకొనగలదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయనే విమర్శ ద్వారా, దాన్ని ప్రజల్లోకి పెద్ద యెత్తున తీసుకుని వెళ్లడం ద్వారా రెండు పక్షాల పోరుగా రాజకీయాన్ని రూపు కట్టించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోంది.

రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్వహించింది. విజయమ్మ పాల్గొన్న ఈ సదస్సులు విజయం సాధించాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అధినేత కడప ఎంపి జగన్‌ జైల్లో ఉండే పార్టీ కార్యక్రమాలను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను గమనిస్తూనే ఇతరపార్టీలకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నారు.

తన తల్లి పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ముందుకు పెట్టి జగన్ పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. విజయమ్మ ప్రాంతీయ సదస్సుల ద్వారా పార్టీలో చురుకుదనం పెరిగిందని, విశ్వాసం ప్రోది చేసిందని అంటున్నారు. రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి దూకిన నాయకుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. వైయస్ జగన్‌కు మద్దతుగా నిలిచి, పదవులను కోల్పోయిన శాసనసభ్యులంతా రాయలసీమకు, కోస్తాంధ్రకు చెందినవారే. తెలంగాణకు చెందిన శానససభ్యులు లేరు. దీంతో ఆ రెండు ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉందనే అంచనాకు వస్తున్నారు.

తెలంగాణలో మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సరైన పట్టు దొరకడం లేదని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన తెలంగాణ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి పనిచేయడం లేదు. ఎవరి ప్రాంతాలకు వారు పరిమితమైనట్లు కనిపిస్తున్నారు. కొండా సురేఖ కూడా తెలంగాణవ్యాప్తంగా పార్టీని విస్తరించే పని చేపట్టడం లేదు. ఆమెకు పార్టీయే ఆ అవకాశం లేకుండా చేసిందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సదస్సుల పేరుతో విజయమ్మ తెలంగాణలో కూడా పర్యటిస్తున్నారు. ఇవి ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాల్సే ఉంది.

మెదక్ జిల్లాలో ఆమె మంగళవారం ప్రాంతీయ సదస్సులో ప్రసంగించారు. హైదరాబాద్‌ జిల్లా మినహా మిగిలిన తొమ్మిది జిల్లాల్లో 25నుంచి వరుసగా తొమ్మిదిరోజులసాటు పర్యటించనున్నారు. తెలంగాణలో జులై 3న నిజామాబాద్‌ జిల్లా పర్యటనతో విజయమ్మ ముగిస్తారు. విజయమ్మ పర్యటనల్లో భాగంగా పలు జిల్లాల్లో పార్టీలోకి కొత్త నేతలను ఆహ్వానించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+