ట్రస్ట్‌కి విరాళాలు పంపండి: చిరంజీవి, సేవాభారతి పిలుపు

బాధితుల కోసం ఇప్పటికే తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించాయి. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు వస్తున్నాయి. అలాగే పలు సేవా సంస్థలు కూడా విరాళాలు సేకరిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు రూ.కోటి, తీహార్ జైలు ఖైదీలు రూ.10 లక్షలు, చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీలు ఒకరోజు మాంసాహారం మానేయడం ద్వారా వచ్చే లక్ష రూపాయలను బాధితులకు అందజేసేందుకు సిద్ధమయ్యారు.
బాధితులను ఆదుకోవాడనికి అందరు ముందుకు రావాలని సేవా భారతి కోరింది. విరాళాల ఇవ్వడం కోసం హైదరాబాదులోని కాచిగూడ, బర్కత్‌పుర కార్యాలయాల్లో సంప్రదించాలని కోరింది.
కాగా హర్భజన్ సింగ్ ఉత్తరాఖండ్ వరదల బాధితులకు రూ.10 లక్షలు విరాళంగా ఇవ్వనున్న విషయం తెలిసిందే. తాను ఉత్తరాఖండ్ బాధితులకు పది లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. తాను పది లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు తాను దీనిని అందజేస్తానని పిటిఐతో భజ్జీ చెప్పారు.












Click it and Unblock the Notifications