వరదలు: చెక్కు చెదరని కేదార్‌నాథ్ ప్రధాన ఆలయం

అయితే కేదార్ నాథ్ ఆలయం మాత్రం అలాగే ఉంది. యావత్ దేశాన్ని కుదిపేసిన ఉత్తరాఖండ్ వరదల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ప్రధాన ఆలయం మాత్రం చెక్కుచెదరకపోవడం గమనార్హం. దాదాపు పదిహేను అడుగుల ఎత్తు వరద నీరు, బురద, భారీ బండరాళ్లు కొట్టుకొచ్చాయి.
దీంతో చాలా నష్టం జరిగింది. ఆలయ పరిసరాల్లోని భవంతులు నేలమట్టమయ్యాయి. కానీ కేదార్ నాథ్ ఆలయ గోడలు కూడా కొద్దిగా కూడా కదల్లేదు. కేదార్ నాథ్ ఆలయం ఇంత పటిష్టంగా ఉండటంతో ఇదంతా దేవుడి వల్లే అని కొందరంటే, ఇంత పటిష్టంగా ఎవరు, ఎప్పుడు నిర్మించారనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
వివరాల ప్రకారం ఈ ఆలయాన్ని దాదాపు పన్నెండు వందల ఏళ్ల క్రితం ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారు. అసలు ఈ ఆలయాన్ని కట్టించింది పంచపాండవులు అనే కథ కూడా ప్రచారంలో ఉంది.
ఈ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధితో పాటు పలు గుళ్లు, భవంతులు కొట్టుకుపోయాయి. ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. ఈ ఆలయాన్ని క్రీ.శ.900-1000 మధ్యకాలంలో ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించారు. ఈ ఆలయంలో స్పటిక శివలింగ, ఆంజనేయుడు, ఆదిశంకరుల విగ్రహాలున్నాయి.












Click it and Unblock the Notifications