కేదార్‌నాథ్ ఆలయ సంపదను కొల్లగొట్టిన సాధువులు

న్యూఢిల్లీ: కేదార్‌నాథ్‌లో సహాయక చర్యలు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇంకా 50 మంది అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు. వారిని ఎందుకు తరలించలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రాణాలతో కేదార్‌నాథ్‌లో ఇప్పటికీ ఉన్నవారు సాధువులు, మూలే ఆపరేటర్లు మాత్రమే. వారు ఆలయ సంపదను, యాత్రికుల నుంచి కొల్లగొట్టిన ఆభరణాలను కొల్లగొట్టినట్లు సమాచారం.

హెలికాప్టర్లలో తరలి రావడానికి సాధువులు పెద్ద సంచులతో వచ్చారని, హెలికాప్టర్‌లో అదనపు బరువు తగ్గించడానికి వాటిని వదిలేయాలని అడిగామని, అందుకు వారు నిరాకరించారని, దాంతో అనుమానం వచ్చి సంచులను తనిఖీ చేశామని, వాటిలో డబ్బులు ఉన్నాయని ఐటిబిపి చీఫ్ అజయ్ చద్దా మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఐటిబిపి కస్టడీలో ఉన్న సాధువులు తాము కేదార్‌నాథ్‌లోనే దేవుడి సేవలో ఉండిపోతామని చెబుతున్నారు. డెహ్రడూన్‌లో దిగిన వెంటనే తమపై పోలీసులు చర్యలు తీసుకుంటారనే భయంతో వారు ఆ విధంగా చెబుతున్నట్లు భావిస్తున్నారు. కేదార్‌నాథ్‌లోనూ పరిసరాల్లోనూ పెద్ద యెత్తున లూటీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Kedarnath Temple wealth

నేపాలీ శరీర పోలికలు ఉన్న యువకులు మొత్తం 25 వేల నగదును లాక్కున్నారని గౌరికుండ్‌లో ఓ యాత్రికుడు చెప్పాడు. కత్తులతో బెదిరించి దుండగులు తన నగలన్నీ లాక్కెళ్లారని ఓ మహిళ చెప్పింది. కేదార్‌నాథ్ నుంచి బయటకు రావడానికి నిరాకరిస్తున్న సాధువులతో పాటు ప్రతి ఒక్కరి నుంచి తరలించాలని ఐటిబిపి భావిస్తోంది.

కొందరు సాధువులు కేదార్‌నాథ్‌ను వదిలిపెట్టడానికి నిరాకరిస్తున్నారని, వారిని ఒప్పించాలని తమ సిబ్బందికి చెప్పామని ఐటిబిపి డిఐజి అమిత్ ప్రసాద్ సోమవారం చెప్పారు. వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్పప్పటికీ సాధువులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టడానికి నిరాకరించడం వెనక సంపదే కారణమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+