సెప్టెంబర్ 17న తెలంగాణ: నాగం, 'హైబ్రిడ్' వద్దు: బిజెపి

Kishan Reddy - Nagam Janardhan Reddy
హైదరాబాద్/నల్గొండ: 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రకటన చేస్తారని ఆ పార్టీ నేత, నాగర్ కర్నూలు శాసన సభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం అన్నారు. ఈ నెల 30వ తేదిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాదులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడమే కాకుండా, తెలంగాణపై అధిష్టానాన్ని నిలదీయాలని సూచించారు.

రాయల తెలంగాణకో, మరో తెలంగాణకో లేదా ప్యాకేజీలకో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లు పెట్టాలని, బిజెపి మద్దతిస్తుందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ మరోసారి ప్యాకేజీలతో మోసం చేయాలని చూస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తాము రాయల తెలంగాణ, ప్యాకేజీలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నెల 27న హైదరాబాదులో తెలంగాణ జిల్లాల బిజెపి నేతల సమావేశం ఉంటుందని, జూలై 27న నవభారత్ సభ హైదరాబాదులో ఉంటుందని, ఆ సభకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారన్నారు.

సీమ తెలంగాణ, రాయల తెలంగాణ అంటూ ఇతర జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసే హైబ్రీడ్ తెలంగాణకు బిజెపి వ్యతిరేకమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి కొన్ని చిల్లాలను కలిపి కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని ఇస్తామంటుందని ఎద్దేవా చేశారు.

పరిణామాలు గమనిస్తున్నాం: కోదండరామ్

తెలంగాణపై ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తాము గమనిస్తున్నామని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ బుధవారం అన్నారు. ఢిల్లీలో వచ్చే నెల మొదటి వారంలో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందన్నారు. ఈ నెల 29న హైదరాబాదులో ప్రజాకోర్టు నిర్వహిస్తామన్నారు. కాగా రౌండ్ టేబుల్ సమావేశానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఆహ్వానిస్తామని బిజెపి తెలిపింది.

తెలంగాణ అంటే.. కోమటిరెడ్డి, ఈటెల

తెలంగాణ కాకుండా ప్యాకేజీ ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెసు పార్టీని ప్యాక్ చేస్తారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ప్యాకేజీలు మండళ్లు కోరుకోవడం లేదని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+