రాష్ట్రమేనని అధిష్టానం గుర్తించింది: తెలంగాణపై డిఎస్

 Srinivas
నిజామాబాద్: 'ప్యాకేజీనా, రాష్ట్ర ఏర్పాటా అనేది కాంగ్రెస్ అధిష్ఠానమే నిర్ణయిస్తుంది, అయితే కచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది' అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు.

త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది కాంగ్రెస్ పార్టీకి శుభపరిణామమని ఆయన అన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలంగాణకు ప్యాకేజీ ప్రకటిస్తున్నారంటూ వస్తున్న కథనాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆ విధంగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ కోసం దశాబ్ద కాలంగా ప్రజలు పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. వారి ఆకాంక్షను కాంగ్రెసు అధిష్టానం అర్థం చేసుకుందని డిఎస్ అన్నారు.

రాష్ట్రం ఏర్పాటు చేయకుండా ఎలాంటి పరిష్కారాలు వెతికినా ప్రజలు అంగీకరించరనే విషయాన్ని కూడా అధిష్టానం గుర్తించిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన హైదరాబాదు నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. దానికి తెలంగాణ జిల్లాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+