నలుపు దుస్తులతో విచారణకు శంకరన్న, కిరణ్‌పై మళ్లీ

Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి, డిజిపిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ కంటోన్మెంట్ సీనియర్ శాసన సభ్యుడు శంకర రావు బుధవారం సైఫాబాద్ పోలీసులు ఎదుట హాజరయ్యారు. ఆయన నలుపు దుస్తులతో పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. విచారణ అనంతరం పోలీసులు నివేదికను కోర్టుకు అందజేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా శంకర రావుకు సైఫాబాద్ పోలీసులు రెండుసార్లు నోటీసులను ఇచ్చారు. మూడు రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికీ శంకర రావు అనారోగ్యం పేరుతో విచారణకు హాజరు కాలేదు. మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఈ రోజు మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు.

విచారణకు హాజరయ్యే ముందు ఆయన మాట్లాడుతూ తాను శంకర రావుకు బదులు శంకర్ రెడ్డి అయి వుంటే బాగుండేదని, శంకర రావు కాబట్టే తనపై కేసు పెడుతున్నారని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.

ఎపి భవన్‌లో తెలుగుదేశం పార్టీ వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించడం సరికాదని ఆయన అన్నారు. జూలై 1 లోగా తెలంగాణ వస్తుందని తన అంతరాత్మ చెబుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

గాలి బెయిల్ స్కాం కేసులో..

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో చర్లపల్లి జైలులో ఉన్న యాదగిరిని విచారించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ రోజు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు ఈడి యాదగిరిని చర్లపల్లి జైలులో విచారించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+